రాష్ట్రంలో కరోనా ప్రభావంతో.. తొలి మరణం నమోదైంది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల వృద్ధుడు చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 30న ఉదయం 11.30 గంటలకు పరీక్షల నిమిత్తం వచ్చిన బాధితుడు.. గంట వ్యవధిలోనే.. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చనిపోయినట్టు తెలిపింది. అతనికి రక్తపోటు, మధుమేహం ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అతని కుమారుడు మార్చి 17న దిల్లీ నుంచి వచ్చాడని.. పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ గా వచ్చిందని చెప్పారు. కుమారుడి నుంచే తండ్రికి వైరస్ సోకి ఉంటుందని భావించారు.
ఇదీ చూడండి: