కృష్ణాజిల్లా విజయవాడ అజిత్సింగ్ నగర్ సమీపంలో ఓ కరెంట్ స్తంభానికి మంటలు అంటుకున్నాయి. కరెంట్ స్తంభానికి ఉన్న వివిధ రకాల కేబుళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు రోజులుగా నగరంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో విద్యుదాఘాతం జరిగి ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని స్ధానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జన సంచారం లేకపోవటంతో ప్రమాదం తప్పింది.
ఇదీచూడండి. విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని తెదేపా నిరసన