ETV Bharat / state

అగ్గిపెట్టెల లారీలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం - కృష్ణా జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీ

అగ్గిపెట్టెల లోడ్​తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విజిలెన్స్​ అధికారులు తనిఖీలు జరుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమై మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది.

అగ్గిపెట్టెల లోడ్​ లారీలో మంటలు...తప్పిన పెను ప్రమాదం
author img

By

Published : Jul 20, 2019, 4:57 PM IST

అగ్గిపెట్టెల లోడ్​ లారీలో మంటలు...తప్పిన పెను ప్రమాదం

కృష్ణా జిల్లాలోని విజయవాడ ప్రకాశం బ్యారేజీ వారధి వద్ద అగ్గిపెట్టెల లోడ్​తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వారధి వద్ద విజిలెన్స్ అధికారులు తనీఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన చెక్​పోస్టు సిబ్బంది నీళ్లు చల్లి మంటలార్పారు. ఓవర్ లోడ్​తో వెళ్తుండటంతో.. లారీని సీజ్ చేశారు.

ఇదీ చదవండి... అదుపుతప్పిన ట్రాలీ...తప్పిన పెను ప్రమాదం

అగ్గిపెట్టెల లోడ్​ లారీలో మంటలు...తప్పిన పెను ప్రమాదం

కృష్ణా జిల్లాలోని విజయవాడ ప్రకాశం బ్యారేజీ వారధి వద్ద అగ్గిపెట్టెల లోడ్​తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వారధి వద్ద విజిలెన్స్ అధికారులు తనీఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన చెక్​పోస్టు సిబ్బంది నీళ్లు చల్లి మంటలార్పారు. ఓవర్ లోడ్​తో వెళ్తుండటంతో.. లారీని సీజ్ చేశారు.

ఇదీ చదవండి... అదుపుతప్పిన ట్రాలీ...తప్పిన పెను ప్రమాదం

Intro:శివ. పాడేరు

ఫైల్: ap_vsp_76_28_icds_lekkallo_annee_akramale_avb_c11_pkg

యాంకర్: మహిళా శిశు సంక్షేమం ముసుగులో తప్పుడు బిల్లులతో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు నిధులు కైంకర్యం చేస్తున్నారు. తాము మహిళ సంక్షేమమ్ కోసం పనిచేసే మహిళలం తమను ఎవరు అడుగు తారని అక్రమాలకు తెరదించుతున్నారు. విశాఖ జిల్లాలో ఐసీడీస్ శాఖ పరిధిలో సమాచార చట్టం ద్వారా వెలికి తీసిన కొనుగోలు బిల్లుల్లో అవకతవకలపై కధనం.
వాయిస్1) మహిళా, శిశు సంక్షేమం కోసం, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు కోసం నిత్యం కోట్లాది రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది. దీనిని ఆసరా చేసుకుని ఆ శాఖ అధికారులు సరకుల కొనుగోలులో తమదైన శైలిలో చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. సమాచార చట్టం ఆశ్రయించి ఆయిల్ బిల్లులు పరిశీలించగా పలు అక్రమాలు కనిపిస్తున్నాయి. అవసరాలకు మించి బిల్లులు తీసుకోవడం, ఒకే బిల్లు ఒకే నెలలో రెండు మూడుసార్లు నమోదు చేసి ఖజానా కాజేయడం ఇలా ఓ నెలలో లక్షలాది రూపాయలు నగదు వెనుకేసుకుంటున్నారు. పాడేరు సమాచార చట్టం కార్యకర్త అల్లాడ శ్రీనివాస్ తో కలిసి ఈటీవీ సేకరించిన ఐసీడీఎస్ లో పలు అంశాలు బయటపడ్డాయి. పాడేరు ఏజెన్సీ అంగన్వాడీ సెంటర్లకు చెందిన ఆయిల్ కొనుగోలు బిల్లులు 2011 నుంచి అడుగగా కాలయాపన చేసి ఓ ఏడాది మాత్రమే ఇచ్చారు. అందులో పరిశీలించి న అంశాల్లో పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు కు చెందిన ఒకే బిల్లు రెండు సార్లు నమోదుచేసి నగదు కాజేశారు. దీనిపై 2015లో ఆ శాఖ తన ఉద్యోగులను వెనుకేసి బిల్లులు ఇఛ్చిన ఆయిల్ సంస్థ నుంచి రూ. 5 లక్షలు రికవరీ చేసినట్లు చూపి ఉద్యోగులపై చర్యలు లేకుండా చేశారు. దీనికి ఎటువంటి జ్యుడీషియల్ కమిటీలేదు. అధికారులపై శాఖాపరమైన చర్యలు లేవు.

బైట్: అల్లాడ శ్రీనివాస్, సమాచార చట్టం వేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు
యాంకర్2) ఒక్కోమండలానికి నెలకు సరాసరి 3 నుంచి 5 లక్షల వరకు ఆయిల్ అవసరం ఉంటుంది. చింతపల్లి మండలానికి ఓ నెలకు సరాసరి 13 లక్షల ఆయిల్ బిల్లు చూపి నిధులు దుర్వినియోగం చేసినట్లు ఖజానా చెల్లించిన బిల్లుల్లో తేటతెల్లం అవుతోంది. ఇవే కాకుండా అంగన్వాడీ సెంటర్లకు కొనుగోలు చేసే ప్రతి సరకు కూడా టోకు, రిటైల్ ధర కంటే అధికధర చెల్లించి రాష్ట్ర ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. ఉదాహరణకు గ్యాస్ పొయ్యిలు, కుక్కర్లు టోకు ధరల్లో కొన్నప్పటికీ బాక్సుపై ఉన్న ధరలకు బిల్లులు సమర్పించి కాజేస్తున్నారు.
బైట్: శంకర్, సీఐటీయూ, జిల్లా కార్యదర్శి

యాంకర్ 3): పాడేరు సామాజిక కార్యకర్త ఐసీడీఎస్ నెలవారీ బిల్లులు ఇమ్మని గత మూడేళ్ళుగా కార్యాలయానికి దరఖాస్తు చేసి అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అక్రమాలు బయట పడతాయని భయంతో కాల యాపన చేశారు. కార్యకర్త తమను బెదిరిస్తున్నారంటూ, వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యకర్తపై తప్పుడు ఫిర్యాదు మానుకోవాలని ఐసీడీఎస్ సిబ్బంది ని
పోలీసులు హెచ్చరించారు. చివరకు ఈ విషయం సమాచార కమిషనర్ కె.జనార్దన్రావు నేరుగా తన కార్యాలయానికి పిలిపించి హెచ్చరించారు. చేసేది లేక 2011 సంవత్సరానికి చెందిన ఐసీడీఎస్ బిల్లులు ఇచ్చారు. మిగిలిన సమాచారం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

బైట్: అల్లాడ శ్రీనివాస్, సమాచార చట్టం వేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు

వాయిస్4) మహిళా శిశు సంక్షేమ శాఖ లో అధికారులు, కింద స్థాయి సిబ్బంది అందరూ మహిళలే ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు. దీనిని అడ్డం పెట్టుకుని అడిగేవారు ఉండరని బిల్లులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఖాజానా అధికారులు సైతం వారి చేతి ఊతం అందించి ప్రభుత్వ సొమ్ములు పక్కదారి పట్టిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.
బైట్: అల్లాడ శ్రీనివాస్, సమాచార చట్టం వేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు

వాయిస్5) అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం సరకులు సరఫరా చేస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో పప్పు, బియ్యం, గుడ్లు, ఆయిల్, చనగఉండలు, నెయ్యి, పిండిలు, ఇలా పోషక విలువైన సామాగ్రి కొనుగోలు చేస్తూనే ఉంటారు. ప్రతి అంశంలోను అధిక ధరలు, లెక్కల్లో మోసాలు, తూనికల్లో తేడాలు ఇలా రకరకాలగా కోట్లాది ప్రభుత్వధనం పక్కదారి పడుతోంది. కొన్ని చోట్ల సూపర్ వైజర్లు సరకులు, గుడ్లు అంగన్వాడీ కు చేరకుండానే పక్కదారి పట్టిస్తున్నట్లు అంగన్వాడీ సెంటర్ల వద్ద కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు.

వాయిస్: సుందరరావు, సీపీఎం, డివిజన్ కార్యదర్శి
ఎండ్ వాయిస్: ప్రభుత్వ ఆశయం మహిళలు, చిన్నారులకు పోషక ఆహారం అందించడం ఇటువంటి మహత్తర ఆశయం ఆసరా చేసుకుని ఇటువంటి చిల్లర అక్రమాలు అరికట్టి ప్రభుత్వ ఖజానా కాపాడాలని పలువురు కోరుతున్నారు.
శివ, పాడేరు


Body:శివశివ


Conclusion:9493274036

For All Latest Updates

TAGGED:

లారీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.