ETV Bharat / state

గుడివాడ పురపాలక కార్యాలయంలో అగ్నిప్రమాదం - కృష్ణా జిల్లా గుడివాడలో అగ్ని ప్రమాదం వార్తలు

కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం మందిరంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. లక్షలాది రూపాయల ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయింది.

గుడివాడ పురపాలక కార్యాలయంలో అగ్నిప్రమాదం

author img

By

Published : Jun 5, 2021, 12:09 PM IST

గుడివాడ మున్సిపల్ కార్యాలయంలోని రెండో అంతస్థులో కౌన్సిల్ హాల్ ఉంది. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో ఆ మందిరాన్ని వినియోగించడం లేదు. అప్పడప్పుడూ.. కొవిడ్ సమావేశాలు అందులో ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా కౌన్సిల్ హాల్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది అందరు బయటకు వచ్చి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారి ఆంజనేయులు ఆధ్వర్యంలో సిబ్బంది అగ్నికీలలను ఆర్పివేశారు. అప్పటికే అందులోని నాలుగు ఏసీలు, విద్యుత్ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. పైన అలంకరించిన రూఫ్ సగానికి కాలిపోయింది. గోడలు మెుత్తం పొగతో నల్లగా మసిబారిపోయాయి. కార్యాలయం నుంచి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఆందోళన చెందారు. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షలకుపైగా ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పురపాలక కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి: మావటికి ఏనుగు అశ్రునివాళి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.