ETV Bharat / state

పెనుగంచిప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం - కృష్ణా సమాచారం

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలురకాల దస్త్రాలు కాలి బూడిదయ్యాయి. విద్యుత్ ప్రమాదం కారణంగానే మంటలు వ్యాపించినట్లు తహసీల్దార్ షాకిర బేగం తెలిపారు.

Fire Accident At Penuganchirprolu Tahsildar Office in Krishna district
పెనుగంచిప్రోలు తహసిల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jan 3, 2021, 5:08 PM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్పందన ఫిర్యాదులను స్వీకరించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్​లోని పలురకాల దస్త్రాలు దగ్ధమయ్యాయి. విద్యుత్ ప్రమాదం జరగటం వలన మంటలు చెలరేగాయని తహసీల్దార్ షాకిర బేగం అన్నారు. కాలిపోయిన దస్త్రాలు నిరుపయోగమైనవని పేర్కొన్నారు. కార్యాలయం ఆవరణలోని చెత్తను దగ్ధం చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసిపడి మంటలు వ్యాపించాయని మరికొందరు చెప్పారు.

ఇదీ చదవండి:

మహంతి చేపల మార్కెట్​లో తూనికలు, కొలతలశాఖ అధికారుల తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.