ETV Bharat / state

చెత్తకు నిప్పంటించిన ఆకతాయిలు.. మంటలను అదుపుచేసిన సిబ్బంది - Excel Garbage Plant latest news

విజయవాడ నగర శివారులో కొంత మంది ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టారు. ఈ కారణంగా.. అగ్ని ప్రమాదం జరిగింది. యాభై మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

fire accident
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
author img

By

Published : Mar 28, 2021, 1:26 PM IST

విజయవాడ నగర శివారులోని అజిత్​సింగ్ నగర్ ఎక్సెల్ చెత్తప్లాంట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టటంతో.. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ వ్యాపించటంతో చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యాభై మంది సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆకతాయిలు చెత్తకు నిప్పుపెట్టే దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. 8 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.