ఢిల్లీలో జమాతే ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షుడిని కలిశారు ఏపీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు ఫరూఖ్ షుబ్లీ. రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు, పరిస్థితులపై షుబ్లీ ఆయనకు వినతిపత్రం అందజేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, హాజిరాపై అత్యాచారం, దాచేపల్లిలో అలీషా, కడపలో అక్బర్ బాషా ఘటనలను షుబ్లీ, మౌలానా హుస్సేన్లు వివరించారు. మైనార్టీల హక్కుల పరిరక్షణ, ఘటనలపై విచారణ నిర్వహించాలని షుబ్లీ కోరారు.
ఇదీ చదవండి : JAGAN CBI CASES: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ