ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో కేంద్రం విఫలమైందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చానని స్పష్టంచేశారు. ప్రధాని మోదీని చౌకీదారుగానో, చాయ్వాలాగానో ఎవరూ గుర్తించడం లేదన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల ప్రజలంతా ఇబ్బంది పడ్డారనీ... దేశంలో ముస్లింలు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మోదీ సర్కారును ప్రజలే పడగొడతారన్నారు. గతంలో వాజ్‌పేయి సారధ్యంలో 23 పార్టీలు కలసి పనిచేశాయని... మోదీ సారధ్యంలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉందని ఫరూఖ్ అబ్దుల్లా విమర్శించారు.
ఇవీ చదవండి..