ETV Bharat / state

అన్నదాతల్లో.. తౌక్టే తుపాను దిగులు

తౌక్టే తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లాలోని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఆర్​బీకేల్లో పంట కొనుగోళ్లు సరిగ్గా జరగక... అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది. మరో మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

farmer
అన్నదాత
author img

By

Published : May 17, 2021, 12:00 PM IST

నెల రోజుల్లో ఒక్క రైతు భరోసా కేంద్రం పరిధిలో 147.68 టన్నుల ధాన్యం మాత్రం కొనుగోలు చేశారు. కృష్ణా జిల్లాలో 521 ఆర్‌బీకేలు ఉన్నాయి. రైతుల దగ్గర వందల టన్నుల ధాన్యం ఉంది. కానీ కొనుగోలు మాత్రం నామమాత్రం. ప్రస్తుతం అకాల వర్షాలు.. తౌక్టే తుపాను ప్రభావంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. గత నెల రోజులుగా ఆర్‌బీకేల చుట్టూ తిరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ రకం కొనుగోలు చేయం.. ఈ రకం పనికిరాదు అంటూ తిప్పుకున్నారు. ఈ క్రాప్‌లో లేదంటూ తిరస్కరించారు. శని, ఆదివారాల్లో కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం రాశులు తడిసిపోయాయి.

వాటిని ఆరబెట్టేందుకు అవకాశం లేదు. మరో రెండు మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ దశలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో అన్నదాతలు తలలు పట్టుకున్నారు. ఖరీఫ్‌లో నివర్‌ తుపాను నిండా ముంచితే.. రబీలో ఆశాజనకంగా దిగుబడి వచ్చిందన్న సంతోషం వారిలో లేకుండా పోయింది. తడిసిన ధాన్యంతో దిగాలు పడ్డారు. అధికారులు కొనుగోలు చేస్తున్నామంటున్నా క్షేత్రస్థాయిలో ఆదేశాలు అమలుకాక లబోదిబోమంటున్నారు. గత నెల రోజుల్లో జిల్లాలో 5,383 టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం విశేషం.

జిల్లాలో రబీ సాగులో దాదాపు 2.75 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సాగు నీరు పుష్కలంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగుబడిపై ఆశలు పెంచుకున్నారు. ఖరీఫ్‌లో నివర్‌ తుపాను దెబ్బ తగలడంతో నష్టపోయిన అన్నదాత రబీలో తమ కష్టాలు తీరతాయనే ఆశతో ఉన్నారు. కొంత మంది ముందుగానే వరి కోతలు కోసి దళారులకు ధాన్యం విక్రయించుకున్నారు. జిల్లాలో సుమారు 300 పీపీసీ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేయాలని నిబంధనలు రూపొందించారు. ఆర్‌బీకేలో రైతు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంటు పుస్తకం, ఆధార్‌ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.

వారు ధాన్యం నమూనాలు చూసి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే పీపీసీ కేంద్రానికి తీసుకురావాలని సూచిస్తారు. ఈసారి రైతులు సాగు చేసిన రకాలు నూక అవుతున్నాయని, ప్రమాణాల పరంగా లేవని తిరస్కరించారు. ఇలా చాలా ధాన్యం రోడ్లపై పోసి నిలువ చేశారు. మిల్లర్లు మాత్రం రూ.1401 కొనాల్సిన బస్తా రూ.900, రూ.1000 వరకు కొనుగోలు చేశారు. అయినా ధాన్యం చాలా మిగిలిపోయింది. గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. టార్ఫాలిన్‌లు కప్పుకొని ధాన్యం రాశులను కాపాడుకున్నారు. కానీ గత రెండు రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. శనివారం 24 మండలాల్లో వర్షపాతం నమోదైంది.

సగటున 2ఎంఎం కురిసింది. ఆదివారం ఉదయం పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, అవనిగడ్డ, పెదపారుపూడి, పామర్రు, విస్సన్నపేట, వీరులపాడు, కంచికచర్ల తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయశాఖ దగ్గర కానీ, ఆర్‌బీకేల్లో కానీ టార్ఫాలిన్లు లేవు. ధాన్యం తరలించేందుకు గోదాములు లేవు. గోతాలు సరఫరా చేయలేదు. దీంతో పలువురు రైతులు ధాన్యం కాపాడేందుకు నానాయాతన పడ్డారు.

నందిగామ మండలం పాతకంచలలో ధాన్యపు రాశులపై కప్పిన పరదా

మొక్కజొన్న రాశులు..!

జిల్లాలో మొక్కజొన్న కూడా కొనుగోలు చేయడం లేదు. మార్కెఫెడ్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయాల్సి ఉంది. గత పక్షం రోజులుగా గింజ కూడా కొనుగోలు చేయలేదు. గోతాలు లేవని వదిలేశారు. రైతులు సంచులు అడిగితే రేపు మాపు అంటూ కాలం వెల్లదీశారు. మైలవరం, నందిగామ, తిరువూరు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కజొన్న సాగు చేశారు.

తక్కువ ధరకే అమ్మాను..: బండి రామారావు, తిరువూరు

వాతావరణ పరిస్థితులు గమనించిన వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారు. మరోవైపు పీపీసీ కేంద్రంలో నిబంధనలు అడ్డంకి గా మారాయి. మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేశాను. 130 బస్తాల ధాన్యం రూ.1100 చొప్పున విక్రయించాను. లేకపోతే వర్షాలకు కాపాడుకునే పరిస్థితి లేదు.

పట్టాలు కప్పాం..: మొవ్వ నాగభూషణం, చోడవరం

నేను 15 ఎకరాలు సాగు చేశా. దాదాపు 600 బస్తాలు దిగుబడి వచ్చింది. రోడ్లపై రాశులు ఉంచి పట్టాలు కప్పాను. వాతావరణం ఆందోళనకరంగా ఉంది. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండడం లేదు. వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

సమాచారం లేదు..: కోనేరు వెంకటేశ్వరరావు, గోసాల

నాలుగున్నర ఎకరాలు సాగు చేశాను. ధాన్యం రోడ్డు మీద ఉంది. దాదాపు 150 బస్తాల ధాన్యం. వ్యవసాయ అధికారులను అడిగితే తహసీల్దార్‌ అంటారు. తహసీల్దార్‌ను అడిగితే ఇంకా పైనుంచి సమాచారం రాలేదంటారు. వ్యవసాయశాఖ ఇచ్చిన విత్తనాలే సాగు చేశాం. ఇప్పుడు నూక పేరుతో కొనుగోలు చేయడం లేదు. ఇదెక్కడి దారుణం.

జిల్లాలోని మొత్తం ఆర్‌బీకేలు 521

ధాన్యం కొనుగోలు 76,945 మె.టన్నులు

విలువ రూ.143 కోట్లు

రైతులు 5,383

రబీలో సేకరణ లక్ష్యం 5 లక్షల టన్నులు

ఇదీ చదవండి:

ప్రకృతి సేద్యంలో మహిళ విజయం.. ప్రధాని ప్రశంసల పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.