కృష్ణా జిల్లా దివిసీమ నుంచి ప్రతి రోజు వేల సంఖ్యలో ముంజు కాయలు హైదరాబాద్ కు ఎగుమతి జరిగేవి. ఈ తాటి ముంజల ఆదాయంతో వందలాది మంది జీవనోపాధి పొందేవారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి ప్రభావంతో రవాణాకు ఆటంకం కలగి.. తాటి కాయలు చెట్ల పైనే కాయలు ముదిరి పోతున్నాయి.
మరోవైపు.. దివిసీమలో కొద్దిమంది రైతులు పొలం గట్లపై ఉన్న తాటి చెట్ల కారణంగా.. నీడ వచ్చి పంట దిగుబడి తగ్గుతుందని వాటిని రైతులు నరికివేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పొలం గట్లు పై ఉన్న వాటిని నరకకుండా ఆయా మండల రెవిన్యూ అధికారులు ఒల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: