కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో వాటర్ ట్యాంకు లిఫ్టింగ్ పంపు హౌస్ కు వెళ్లే దారిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. ప్రాణాపాయంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. భూమికి కేవలం 6 అడుగుల ఎత్తులో ఉన్న తీగలు.. కాస్త పొడవైన వారికి చేతికి తగులుతున్నాయి.
పొలంలో దుక్కులు దున్నుకోటానికి, వరిగడ్డి తోలుకోటానికి అడ్డు తగులుతున్నాయి. పశువుల కోసం రైతులు పచ్చిగడ్డి నెత్తిమీద పెట్టుకుంటే వారికి తీగలు తగిలే ప్రమాదం ఉంది. ఏడాది నుంచి విద్యుత్ శాఖ అధికారులకు తెలిపినప్పటికి తీగలు సరిచేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: