కృష్ణా జిల్లా నందిగామ నగరపంచాయతీలోని 20వ వార్డులో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ... మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రచారం చేపట్టారు. నగర పంచాయతీ ఛైర్పర్సన్ అభ్యర్థి శాఖమూరి స్వర్ణలత, అభ్యర్థులతో కలిసి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
రాష్ట్రంలో నడుస్తున్న అరాచక పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తంగిరాల సౌమ్య ఆరోపించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తెలుగుదేశం హయాంలో రూ.88 కోట్లు మంజూరయ్యాయని, పనులు టెండర్లు దశలో ఉండగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పనులు నిలిపివేసిందని విమర్శించారు. నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని, జీ-ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.
ఇదీచదవండి.