అప్పుల బాధతో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా పున్నవల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పోరుగంటి పుల్లారావు 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. అప్పు చేసి పెట్టుబడి పెడితే... అధిక వర్షాలతో దిగుబడి రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచని స్థితిలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్లారావు బలవన్మరణానికి పాల్పడటంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో రెచ్చిపోయిన బ్లేడు బ్యాచ్.. యువకుడి ఛాతీపై గాయం