ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కట్టా లక్ష్మీనారాయణ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని.. రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా నందిగామ ఆస్పత్రిలో పోస్ట్మార్టం గది వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ కర్షకుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. పరిహారం ఇచ్చేవరకు ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నందిగామలోని సీసీఐ కేంద్రంలో పత్తి కోనుగోలు చేయకపోవడం వల్లే లక్ష్మీ నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు ఆరోపించారు. గతేడాది పండిన పత్తిని ఈ ఏడాది తీసుకోకపోవడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడని తెలిపారు. తక్షణమే స్థానిక ఏఎంసీలో కొనుగోళ్లు మొదలుపెట్టాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: 'రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు'