ETV Bharat / state

కొండకు బోల్టులు.. రాళ్లు జారి పడకుండా శాశ్వత పరిష్కారం

ఇంద్రకీలాద్రి పైనుంచి రాళ్లు జారి కిందపడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టిసారించారు. దేశంలోని పలు ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)కు చెందిన నిపుణులతో కూడిన బృందం దుర్గగుడికి నవంబర్‌ 2న రాబోతోంది. కొండ మొత్తాన్ని వీళ్లు పరిశీలించనున్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఉండేందుకు ఏమేం చేయాలనే విషయాలన్నింటిపైనా అధ్యయనం చేస్తారు.

నవంబర్ 2న ఇంద్రకీలాద్రిని సందర్శించనున్న నిపుణుల బృందం

author img

By

Published : Oct 29, 2020, 12:30 PM IST

ఇంద్రకీలాద్రి కొండపై అంతటా ఒకే రకమైన రాళ్లు లేవు. కొన్నిచోట్ల వదులుగా, మరికొన్ని చోట్ల గట్టిగా ఉన్నాయి. ఎక్కువ ప్రాంతాల్లో మెత్తగా, మట్టి మాదిరిగా రాళ్లు ఉన్నాయి. అందుకే.. అన్నింటికీ కలిపి ఒకేరకమైన సాంకేతికత పనిచేయదు. రాయిని బట్టి అది కిందకు జారి పడకుండా ఉండేందుకు ఏం చేయాలనేది నిర్ణయించాలి. కొన్నిచోట్ల రాళ్లు ఒకదానిపై ఒకటి ఉంటే.. పైనున్నది పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి చోట కిందనున్న రాయితో పైన ఉన్నదానికి బోల్టు వేస్తే పట్టి ఉంచుతుంది. చాలాచోట్ల మట్టి మాదిరిగా వదులుగా ఉండే రాళ్లుంటాయి. ఇక్కడ కెనెటింగ్‌ చేయాల్సి ఉంటుంది. చిన్న రాళ్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో చైన్‌ లింక్‌ మెస్‌ వేసి.. క్రాంక్‌లు బిగిస్తారు. తాజాగా అందుబాటులోనికి వచ్చిన సాంకేతికతతో సెన్సార్లను ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అలారం మోగుతుంది. కొండపై ఎక్కడెక్కడ ఎలాంటి రాళ్లున్నాయి, వాటి పరిస్థితి ఏంటనేది పూర్తిస్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేయనుంది.

రాష్ట్ర దేవాదాయశాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు, ఐఐటీ చెన్నైకు చెందిన ప్రొఫెసర్‌ నరసింహారావు, ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మాధవ్‌, బెంగళూరులోని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్‌ శివకుమార్‌, జీఎస్‌ఐకు చెందిన నిపుణులతో కూడిన బృందం ఇంద్రకీలాద్రికి వచ్చే సోమవారం రానుంది. వీళ్లంతా భూ భౌతిక నిపుణులు. ఇలాగే రాళ్లు జారిపడే కొండలకు దేశంలోని అనేకచోట్ల పరిష్కారం చూపిన అనుభవం ఉన్నవాళ్లు. కొండపై ఎక్కడెక్కడ ఎలాంటి సాంకేతికత వాడాలనేది తెలిసిన వాళ్లు. ఇంద్రకీలాద్రి కొండను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఓ నివేదికను ఈ బృందం సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు.

దశాబ్దాలుగా ప్రమాదకరంగా..

దుర్గగుడికి వచ్చే భక్తులకు కొండరాళ్లతో దశాబ్దాలుగా ముప్పు పొంచి ఉంది.తాజాగా వారం కిందట దసరా ఉత్సవాలు జరుగుతుండగా.. వేలాది మంది భక్తులు కొండపై ఉన్న సమయంలో భారీ రాళ్లు జారి పడ్డాయి. సరిగ్గా రాళ్లు పడేచోట ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కొద్ది దూరంలో ఉన్న ముగ్గురికి రాళ్లు తగిలి గాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆలయానికి రావడానికి కొద్ది సమయం ముందే ఈ సంఘటన జరిగింది. ఉత్సవాల ఆరంభం రోజు కూడా ఇదే ప్రాంతంలో చిన్న చిన్న రాళ్లు పడ్డాయి. ఘాట్‌రోడ్డులో భక్తులు పైకి వచ్చే మార్గంలోనూ చాలాసార్లు కొండ చరియలు విరిగి పడ్డాయి. రాళ్లు జారిపడకుండా ఉండేందుకు 2008లో రూ.6 కోట్లు ఖర్చుపెట్టి కొండకు పాక్షికంగా ఇనుప వల వేశారు. కానీ.. పెద్ద రాళ్లు పడినప్పుడు వల ఆపలేకపోతోంది. ఈసారి శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతోనే నిపుణుల బృందం వస్తున్నట్టు దుర్గగుడి ఈఈ భాస్కర్‌ తెలిపారు.

ఇవీ చూడండి : వనయాత్రలో విషాదం.. వాగులో పడి ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.