ETV Bharat / state

ఎన్టీఆర్​ ట్రస్ట్​ నుంచి ఎక్సెల్ సివిల్స్ అకాడమీ - డిసెంబర్​లో ఎక్సెల్​ సివిల్స్ అకాడమీ

ఎన్టీఆర్ ట్రస్ట్ ఎడ్యుకేషన్​ విభాగం నుంచి ఎక్సెల్ సివిల్స్ అకాడమీని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటించారు.

excel-civil-academy-from-ntr-trust
author img

By

Published : Nov 15, 2019, 7:54 PM IST

ఎన్టీఆర్​ ట్రస్ట్​ నుంచి ఎక్సెల్ సివిల్స్ అకాడమీ

పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి సరికొత్తగా ఎక్సెల్ సివిల్స్ అకాడమీని నిర్వహించనున్నట్టు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటించారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. వచ్చే నెల డిసెంబర్ నుంచి మొదటి బ్యాచ్​ని ప్రారంభిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా ఈ అకాడమీని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం గండిపేటలో ఉన్న ఇంటర్, డిగ్రీ కాలేజీలతో పాటు... సివిల్స్ కోచింగ్ సెంటర్​ను నిర్వహించనున్నారు. కేవలం మెరుగైన కోచింగ్ కోసం అత్యధిక ఖర్చులు భరించి సివిల్స్ ఆశయం కోసం యువత దిల్లీ వెళ్తోందని అలాంటి వారికి అందుబాటులో ఉండే ఫీజుల్లో మంచి కోచింగ్​ని ఎక్సెల్ అందిస్తుందని భువనేశ్వరి పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్​ల ఆధ్వర్యంలో ఈ అకాడమీని నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: విత్తనంపై గుత్తాధిపత్యం వద్దు.. కొత్త చట్టం కావాలి!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.