నందిగామ నియోజకవర్గంలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నగర పంచాయతీ కార్యాలయంలోని కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అకాల వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి... వార్డులలో దోమల బెడద ఎక్కువైందని తెలిపారు. వారం రోజుల నుంచి పందులు, కుక్కలు వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నాయని పేర్కొన్నారు. సత్వరమై పారిశుద్ధ్యానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. గ్రామాల్లో, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :