మద్యం అమ్మడంలో ప్రభుత్వం ఆదాయాన్ని చూస్తున్నది గానీ ప్రజలు ఎంతవరకు నష్ట పోతారు అన్నది పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు. కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా మద్యం దుకాణాల వద్ద జనం బారులు తీరుతున్నారని... ఈ విషయం లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తిగా విఫలం అని చెప్పారు.
కరోనా వ్యాప్తి చెందడానికి ఇది కారణం అవుతుందని అంచనా వేశారు. నిజంగానే ఆ పరిస్థితి వస్తే ఎలా.. అని ప్రశ్నించారు. గతంలో హామీ ఇచ్చినట్టు ఈ సమయానికి మద్యపాన నిషేధం చేసి ఉంటే ప్రజల ఆరోగ్యాన్ని నిజంగా కాపాడినవారు అయ్యి ఉండేవారని అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడి అయ్యేవరకు మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వానికి సూచన చేశారు.
ఇదీ చూడండి: