ETV Bharat / state

పుట్టపర్తి నియోజకవర్గంలో చిరుత సంచారం - భయాందోళనలో ప్రజలు - LEOPARD ROAMING IN SATHYA SAI

కృష్ణాపురం, గోపాలపురం పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం - భయాందోళనకు గురవుతున్న ప్రజలు

Leopard Roaming In  PUTTAPARTHI
Leopard Roaming In Sri Sathya Sai District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2025, 2:01 PM IST

Updated : Jan 16, 2025, 2:59 PM IST

Leopard Roaming In Sri Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం, గోపాలపురం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి అప్పస్వామి అనే రైతు అరటి తోటలోకి చిరుత పరుగులు తీయడం చూశామని గ్రామంలోని కొంత మంది యువకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తీసి ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు.

రెండు రోజులుగా చిరుత సంచారం : దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు రైతులు వారికి తెలిపారు. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు చిరుత అడుగులను పరిశీలిస్తున్నారు. స్థానికులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయం అందరికీ తెలిసేలా డబ్బు చాటింపు వేయించారు.

సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రజలు బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. చిరుత గురించి ఏదైనా విషయం తెలిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని సూచించారు. అడవిలోకి మేత కోసం వెళ్లే గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఆ చిరుతను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

తిరుపతిలో రోడ్డుపైకి వచ్చిన చిరుత - ఓ వ్యక్తికి గాయాలు

ముదిగల్లు కొండపై చిరుత - భయాందోళనలో ప్రజలు

Last Updated : Jan 16, 2025, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.