రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోందని.. ఈ మహమ్మారి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. కరోనా కట్టడిపై ప్రతిపక్షనేత చంద్రబాబు బాధ్యతగా వ్యవహరిస్తూ.. నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. సాధారణ జ్వరం అంటూ ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉంటే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలివ్వడం ఏంటని చినరాజప్ప ప్రశ్నించారు. ప్రజలు వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: