కృష్ణానదిలో ఈతకు దిగిన ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ప్రైవేటు స్విమింగ్ అసోసియేషన్‌లో ఆధ్వర్యంలో ఈత కొట్టేందుకు యువకుడు నదిలోకి దూకాడు. ఈతకొట్టలేక మునిగిపోయి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు విజయవాడలోని కృష్ణలంకుకు చెందినవాడని.. కృష్ణా జిల్లాలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడని పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మురం