కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వెంకట పవన్‌కుమార్.. తన తండ్రి జ్ఞాపకాలకు గుర్తుగా వినూత్న ప్రయోగం చేశారు. బాల్యంలో తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై తిరిగిన ఘటనలు మరిచిపోలేక.. ఆ స్మృతులను జీవితాంతం పదిలంగా ఉంచాలనుకున్నారు. చిన్నప్పుడు తిరిగిన వాహనం సీడీ 100 పాతపడిపోవటంతో పక్కన పెట్టేశారు. తనకు ఇష్టమైన ఆ వాహనాన్ని...మళ్లీ రోడ్డుపైకి తేవాలనుకున్నారు. బైకును ఆధునీకరించడం కోసం కొవిడ్ లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వాహనానికి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి..సీడీ 100 బైక్‌ను... స్క్రాంబులర్ మోడల్ తరహాలో ఆధునీకరించారు. పాత సీబీజెడ్ బైకును తీసుకువచ్చి..ఆ వాహనానికి నూతన ఆయిల్ ట్యాంక్‌ను కూడా తయారు చేశారు. నిరుపయోగంగా పడి ఉన్న బైక్‌లను.. రయ్‌మని దూసుకెళ్లే స్పోర్ట్స్ వాహనంలా తయారు చేసి..తన జ్ఞాపకాన్ని పదిలం చేసుకున్నారు.
పాలిటెక్నిక్ పూర్తి చేసి విజయవాడలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న పవన్..ప్రస్తుతం మరో నూతన ప్రాజెక్టును తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించటంలో తన వంతు కృషి చేసేందుకు యత్నిస్తున్నారు. ఇంధనం, గ్యాస్ సౌకర్యాలు...కార్లు, ఆటోలకు మాత్రమే ఉన్నాయి. బైకులో డ్యుయెల్ సౌకర్యం అందుబాటులో లేదు. ద్విచక్రవాహనానికి ఇంధనం, గ్యాస్ అమర్చే పనిలో పవన్ నిమగ్నమయ్యారు .
ఇదీ చదవండి: నాగుపాము హల్‌చల్.. భయంతో పరుగులు తీసిన జనం