ETV Bharat / state

ఇళ్ల మధ్య వేలాడుతున్న 11కేవీ విద్యుత్​ వైర్లు... పట్టించుకోని అధికారులు

Electrical wires: ఆ ఊర్లో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇళ్ల మధ్య వేలాడుతున్న విద్యుత్​ వైర్లతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఎన్నిసార్లు నేతలు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రమాదం జరగక ముందే స్పందించాలని వేడుకుంటున్నారు.

Electrical wires
జనావాసాల మధ్య విద్యుత్​ వైర్లు
author img

By

Published : Mar 6, 2022, 1:30 PM IST

Electrical wires: కృష్ణాజిల్లా నూజివీడు మండలం ఓగిరాల తండ గ్రామంలో ఇళ్ల మధ్యనే 11 కేవీ విద్యుత్​ వైర్లు వేలాడుతున్నాయి. వైర్లు తగిలి ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. అధికారులు, నేతలకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులమని తమను నిర్లక్ష్యంగా చూడటం సరికాదని వాపోతున్నారు.

నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని.. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లను తొలగించి... విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Two Died by Cat Bite: పిల్లి కరిచిన ఇద్దరు మహిళలు ఓకేరోజు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.