కృష్ణాజిల్లా గూడవల్లి డీజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మ్యాచ్‌లో భాగంగా కబడ్డీ నుంచి 25 జట్లు, వాలీబాల్ నుంచి 24 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. పీబీ సిద్ధార్థ కళాశాల, శాతవాహన జూనియర్ కళాశాల జట్లు వాలీబాల్ నుంచి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఆంధ్ర లయోలా కళాశాల, పీబీ సిద్ధార్థ కళాశాల జట్లు కబడ్డీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
ఇదీ చూడండి: నెల్లూరులో ఈనాడు ఆటల పోటీలకు విశేష స్పందన