ETV Bharat / state

'సర్పంచులకు గులాబి... వార్డు సభ్యులకు తెలుపు '

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ముందుగా బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియపై దృష్టి సారించింది.

E.C letter to collectors to complete printing of ballot papers for panchayat elections
బ్యాలెట్ పత్రాలు(పాతచిత్రం)
author img

By

Published : Nov 30, 2019, 11:10 PM IST

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్​ 15లోగా బ్యాలెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియ పూర్తి చేయాలని... రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు లేఖ రాసింది. గత పంచాయతీ ఎన్నికల నాటి కంటే పదిశాతం అదనంగా పత్రాలు ముద్రించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 10 తర్వాత ఎప్పుడైన ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు కనిష్ఠంగా రెండు... గరిష్ఠంగా 14 గుర్తులు ముద్రించనున్నారు. కచ్చితంగా నోటా ఉండేలా చూస్తారు. సర్పంచి అభ్యర్థులకు గులాబి, వార్డు సభ్యులకు తెలుపు రంగులో బ్యాలెట్లు ఉంటాయి. పోలింగ్‌ సమయంలో వినియోగించే బ్యాలెట్‌లో క్రమసంఖ్య, ఎన్నికల గుర్తు మాత్రమే ఉంటాయని... వీటిలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

'శంషాబాద్‌' నిందితులకు 14 రోజుల రిమాండ్‌

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.