భారీ వర్షానికి విజయవాడలోని 30వ డివిజన్ కొండపై రిటైనింగ్ వాల్ కూలిపోయింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వన్ టౌన్‌లోని 29, 30 డివిజన్‌ల పరిధిలో కొండలపై నివాసిముంటున్న వారికి ఏర్పడిన అసౌకర్యాలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న స్వయంగా వెళ్లి తెలుసుకున్నారు. వర్షాలకు కొండపై నడిచే రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్, తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు.
ఇదీ చూడండి హోదా విషయంలో సీఎం జగన్ మభ్యపెడుతున్నారు'