లాక్ డౌన్లో భాగంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యవసర వస్తువుల కొనుగోలుకు అవకాశం ఉన్న కారణంగా.. ప్రజలు ఆ వేళల్లో రోడ్లపైకి పెద్ద సంఖ్యంలో తరలివస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో రహదారులన్నీ ప్రజలతో కిటకిటలాడాయి. ఎన్టీఆర్ స్టేడియంలోకి రైతు బజార్‌ను అధికారులు మార్చారు. కూరగాయలు కొనడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో స్టేడియం మొత్తం కిటకిటలాడింది. సామాజిక దూరం పాటించకుండా వినియోగదారులు గుంపులు గుంపులుగా, కూరగాయలు కొనడానికి ఎగబడ్డారు. గన్నవరంలోనూ ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు. ఉగాది సందర్భంగా కొనుగోళ్లు చేశారు.
ఇదీ చూడండి: