ETV Bharat / state

తెదేపా నేతలను అక్రమంగా అరెస్టు చేశారని భగ్గుమన్న పార్టీ శ్రేణులు - లోకేష్ అరెస్టు నిరసనగా ఆందోళనలు

ప్రభుత్వం అక్రమ అరెస్టులను ప్రోత్సహిస్తోందని తెదేపా నేతలు ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని ప్రాంత రైతుల కోసం పోరాడుతోన్న తమపై వైకాపా నేతలు దాడి చేస్తున్నారని ఆరోపించారు.

due to arrest of tdp national chief Secretary lokesh tdp leaders dharana  all over the state
అక్రమ అరెస్టులకు నిరసనగా భగ్గుమన్న తేదేపా నేతలు
author img

By

Published : Jan 7, 2020, 9:47 PM IST

అక్రమ అరెస్టులకు నిరసనగా భగ్గుమన్న తెదేపా నేతలు

రాజధాని రైతుల కోసం దీక్షలు చేస్తున్న తెదేపా నేతలను పోలీసులు నిర్భంధించటాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కృష్ణా జిల్లా తోట్లవళ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు తెదేపా కార్యకర్తలు యత్నించడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్ప కూడలి వద్ద రహదారిపై బైఠాయించి తెదేపా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోనూ తెదేపా శ్రేణులు ఆందోళన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:

రైతుల ముసుగులో...తెదేపా కార్యకర్తలే దాడి చేశారు'

Intro:ap_knl_31_07_Lokesh arest_tdp dharna_av_ap10130
సోమిరెడ్డి, రిపోర్టర్
ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
8008573794.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సోమప్ప కూడలిలో రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Body:టీడీపీ

Conclusion:ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.