రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పొడి వాతావరణం వల్ల....సాధారణం కంటె 3 నుంచి 4 డిగ్రీల మేర అధిక ఉష్టోగ్రతలు నమోదవుతాయని.... అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో.... తూర్పు,ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రల్లో పొడి వాతావరణం వల్ల అధిక ఉష్టోగ్రతలకు అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోనూ రానున్న 3 రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.
ఇవీ చదవండి: