కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో ఉన్న నందిగామ, హనుమంతుపాలెం, అనాసాగరం గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్నేరుపై కేసర్ వద్ద ఏర్పాటు చేసిన బోరు నుంచి రక్షిత మంచినీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్లైన్ పాడయ్యింది.
నీరు వృథాగా పోతూ.. అంబర్ పేట క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారి పక్కన చెరువులా మారింది. దీన్ని గుర్తించిన అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి వెంటనే మరమ్మతులు చేపట్టారు.
ఇదీ చదవండి: