కృష్ణా జిల్లాలోని చంద్రగూడెం ప్రాంతంలో ఓ అన్నదాత నూతన సాగుకు శ్రీకారం చుట్టారు. చంద్రగూడెం గ్రామంలోని మైలవరం ప్రాంతానికి చెందిన తుమ్మా సురేష్ బాబు అనే రైతు... తనకున్న 80 సెంట్ల భూమిలో లాభాలు ఇచ్చే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు.
ఎలాంటి అనుభవం లేకపోయినా కేవలం నూతన సాగుపై ఉన్న మక్కువతో గురజాల నుంచి మొక్కలు తెప్పించి 5 వందల పోల్స్ వేసి మొత్తం 2 వేల మొక్కలు నాటి.. డ్రిప్ ఏర్పాటు చేశామని రైతు సురేష్ బాబు తెలిపారు. మొదటి సారి పెట్టిన పెట్టుబడి మినహా ఈ సాగులో పెద్దగా ఖర్చు ఉండదని, మొక్క నాటిన దగ్గర నుంచి 9 నెలల కాలంలో పంట చేతికొచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
ప్రత్యేక శ్రద్ధతో సేంద్రియ ఎరువుల వాడకం వల్ల... తమకు కేవలం 7 నెలల 15 రోజుల కాలంలోనే పిందె వేసిందన్నారు. మొదటి సంవత్సరంలోనే వ్యయం చేసిన ఈ సాగులో... సంవత్సరం తర్వాత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్కి ఉన్న డిమాండ్ దృష్ట్యా... 5 సంవత్సరాల వరకు వచ్చే దిగుబడితో లాభాలు గడించే అవకాశం ఉంటుందని సురేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: