కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో జాతీయ రహదారిపై పది అడుగుల కొండచిలువ రోడ్డు మీద ప్రత్యక్షమైంది. గన్నవరం నుంచి ఎలూరు వైపు వెళ్లే జాతీయరహదారిపై అర్థరాత్రి రోడ్డు దాటుతున్న కొండచిలువను గుర్తించిన వాహన చోదకులు వాహనాల వేగం తగ్గించుకొని కండచిలువకు ఎటువంటి హాని చేయకుండా రోడ్డు దాటే వరకు ఆగారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి.. నీటి ప్రవాహం ద్వారా వచ్చి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇదే ప్రాంతంలో మరికొన్ని కొండచిలువలు తమకు కనిపిస్తునే ఉంటాయని సమీప గ్రామస్థులు తెలుపుతున్నారు.
ఇదీ చదవండిమధురానగర్లో కొండచిలువ హల్చల్...