దేశవ్యాప్తంగా ఉన్న సముద్ర తీర ప్రాంతంలో బ్లూ గ్రోత్ ఎకానమీలో భాగంగా స్పేషియల్ ప్లానింగ్ చేయనున్నట్లు కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం గుజరాత్ తీరంలో ఈ స్పేషియల్ ప్లానింగ్‌ను ముగించామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉందని స్పష్టం చేశారు.
'రెట్టింపు చేసేందుకు కృషి'
గుజరాత్లో 7.5 లక్షల టన్నుల సముద్ర మత్స్య సంపద ఉత్పత్తి అవుతోందని.. స్పేషియల్ ప్లానింగ్ ద్వారా ఈ ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా ఏపీ సముద్ర తీర ప్రాంతంలోనూ చేపల సాగుకు పుష్కలంగా అవకాశాలున్నాయని చెబుతున్న సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తతో ఈటీవీ భారత్ ముఖాముఖి.