శునకాలు విశ్వాసానికి ప్రతి రూపాలని అంటారు. జంతు ప్రేమికులు చాలామంది శునకాలను ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పెంచుకుంటూ ఉంటారు. అవి అనారోగ్యంతో మరణించిన ప్రమాదవశాత్తు మరణించిన తమ కుటుంబలోని వ్యక్తిని కోల్పోయిన విధంగా బాధపడుతుంటారు. కానీ కొన్ని రోజులకు మర్చిపోవాల్సిందేగా..
కానీ కృష్ణ జిల్లా బాపులపాడు మండలం అంపపురానికి చెందిన రైతు ఐన సుంకర జ్ఞాన ప్రకాష్ మాత్రం ఆ శునకం చనిపోయి 5 ఏళ్లు గడుస్తున్నా దానిని మరిచిపోలేకపోతున్నాడు. మనుషులకు నిర్వహిచే విధంగా వర్ధంతులు కూడా నిర్వహిస్తున్నారు. శునకం చనిపోయి ఐదు ఏళ్లు గడిచిన సందర్భంగా ఇవాళ 5వ వర్ధంతిని నిర్వహించారు. ఊర్లోని వారికి భోజనాలు కూడా పెట్టారు. ఇద్దరు కూతుళ్లకి పెళ్లి అయిపోయిన తర్వాత ఈ కుక్కని ప్రేమతో పెంచుకున్నామని, అనారోగ్యంతో చనిపోవడంతో ఏటా జూలై 22న వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: javahar: 'పేదల కన్నీటి ప్రవాహంలో.. వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుంది'