నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫాం వద్ద రోడ్డు ప్రమాదంలో కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లింది. గాయపడి చనిపోయిన కుక్క పిల్ల వద్ద దాని తల్లి దీనంగా చూస్తోంది. ఆ తల్లి హృదయం తల్లడిల్లిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. నోరులేని మూగ జీవి చాటుతున్న ప్రేమ అయినా చూసి మనుషుల్లో మార్పు వస్తుందేమో చూడాలి.
ఇదీ చదవండి: పోలీసులకు చిక్కిన "కిలాడీ" జంట..!