మైలవరంలోని స్థానిక సాయిబాబా కల్యాణ మండపంలో ఉద్యావన, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ రైతులకు తైవాన్ స్ప్రేయర్లు పంపిణీ చేశారు. వీటిని ప్రభుత్వం 90 శాతం రాయితీతో అందిస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అర్హులైన నూట యాభై మందికి స్ప్రేయర్లను అందించారు.
రైతులకు చేయూత అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. సీఎం అన్నదాతల మేలు కోసం తపిస్తారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఉద్యావన, గిరిజన సంక్షేమశాఖ అధికారులు, తహసీల్దార్, రెవెన్యూశాఖ ఉద్యోగులు, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
అర్హులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర స్థాయి సదస్సు