భూమికి జవజీవాలను ఇచ్చే దేశవాళీ విత్తనాలను రైతులకు విరివిగా అందజేయడానికి ఈ నెల 18న సేవ్ సంస్థ ‘విత్తన పండగ’ నిర్వహించనుంది. కృష్ణా జిల్లా తరకటూరు సమీప పినగూడూరులంక సౌభాగ్య గోశాల సేవ్ కార్యాలయంలో, హైదరాబాద్‌లోని పాలేకర్ కార్యాలయంలో ఈ నెల 18 నుంచి 20 వరకు దేశీయ విత్తనాలను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 28న కర్నూలు జిల్లా జూపూడి గ్రామంలో ప్రకృతి రైతుల సదస్సు నిర్వహించి, విత్తనాల్ని పంపిణీ చేస్తారు.
ఒడిశాకు చెందిన దేశీయ విత్తన ఉద్యమకారిణి సబర్మతి, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఉద్యమకారుడు, శాస్త్రవేత్త అనుపమ పాల్ సహకారంతో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయవేత్త విజయరాం ఈ క్రతువును నిర్వహించనున్నారు. విత్తన ఉద్యమకారులు అందించిన 365 రకాల స్వదేశీ వరి విత్తనాలు హైదరాబాద్, కృష్ణా జిల్లా పినగూడూరులంకకు శనివారం సాయంత్రానికి చేరాయి. విత్తనాలు కావల్సినవారు 9573603953, పాలేకర్ కార్యాలయం 040-27654337 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఇదీ చూడండి. bangaru bonam : విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించిన తెలంగాణ