బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీజీపి గౌతం సవాంగ్ ఆదేశించారు. 24 గంటలు విధుల్లో ఉంటూ.. ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా చూడాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఎక్కడ ఎలాటి ఇబ్బంది కలిగినా సత్వరమే డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు డీజీపీ కోరారు.
ఇదీ చూడండి: