మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడమే దిశ చట్టం ఉద్దేశమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ చట్టంపై జిల్లాల ఎస్పీలతో డీజీపీ విజయవాడలో సమావేశం నిర్వహించారు. దిశ చట్టంతో వేగంగా కేసు దర్యాప్తు చేయటంతో పాటు నిందితులను తక్షణమే అరెస్టు చేస్తామన్నారు. సాధ్యమైనంత తొందరగా ఫోరెన్సిక్ నివేదికలు, డీఎన్ఏ రిపోర్టులు ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. నిర్ణీత సమయంలో వయసు నిర్ధరణ, పోస్ట్ మార్టం, అన్ని రకాల రిపోర్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడతో పాటు విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: