Penuganchiprolu Tirupatamma Ammavari Temple: కృష్టా జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ ఆలయాన్ని ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. శుక్ర, ఆదివారాల్లో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పొంగళ్లు చేసి మొక్కులు తీర్చుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఒకరోజు ముందే వచ్చి ఆలయం వద్ద రాత్రి నిద్ర చేయటం ఇక్కడి ఆచారం. దీని కోసం రెండేళ్ల క్రితం 2 చిన్నపాటి షెడ్లు అందుబాటులోకి తీసుకువచ్చినా.. అవి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు సరిపోవడం లేదు. చేసేదిలేక ఆలయం బయట ఉన్న సిమెంట్ రోడ్డు పైనే భక్తులు రాత్రిపూట నిద్ర తీయాల్సి వస్తుంది. ఆలయం బయట ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడుపుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత భక్తుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని దేవస్థానం ఛైర్మన్ వెల్లడించారు. త్వరలోనే వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆరు బయట బస చేసే భక్తుల కోసం సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని భక్తులంటున్నారు. ఆలయ కమిటీ త్వరగా స్పందించి పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి..: NITI AAYOG: వీరపనేనిగూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన