కృష్ణా జిల్లా దివిసీమలో పెదకళ్లేపల్లి, సంగమేశ్వరం, అవనిగడ్డ పాత ఎడ్లలంక, నడకుదురు, ఘంటసాల శివాలయాల్లో ఉదయం నుంచి భక్తులు కృష్ణా నదిలో పుణ్య స్నానం చేసి శివునికి పూజలు చేశారు. అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులు సుమారు 200 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 11 వరకు సుమారు 50వేల మంది స్వామిని దర్శించుకున్నారు. ఆలయం బయటభక్తులు ఎండలో నిల్చొని స్వామి దర్శనం చేసుకున్నారు.
నందిగామలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. సంగమేశ్వర స్వామి ఆలయ తిరునాళ్ల మహోత్సవం ఎంతో విశిష్టమైన చరిత్ర ఈ ఆలయం సోంతం. ఏటా మహాశివరాత్రికి జరిగే స్వామి కళ్యాణోత్సవానికి కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
శ్రీ శుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకములు నిర్వహించారు.
ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన గన్నవరం మండలం శ్రీ భ్రమరాంబికా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముస్తాబాద కొండ గుహలో కొలువైన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా.. విశేష అలంకరణలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు.
ఇదీ చూడండి: