కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మార్గశిర షష్టి, ఆదివారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయం వద్ద కిలోమీటరు దూరం వరకు భక్తులు ఎండలో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయాధికారులు కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తాగునీటి సమస్యను ఎదుర్కొన్నారు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయాధికారులకు తెలిసినా.. కనీస వసతులు కల్పించకపోవటంపై భక్తులు నిరాశకు లోనయ్యారు.
ఇదీ చదవండి:
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి