పెనమలూరు నియోజకవర్గంలో మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... దేశ రాజధాని పొగ వల్ల, ఏపీ రాజధాని పగ వల్ల కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పేరు చెప్పి మాతృభాషను మరచిపోయేలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నోరు మూగబోయిందా అని ప్రశ్నించారు. . ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడి చేస్తోందని ఆక్షేపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వంతులు వేసుకుని ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఇదీచూడండి.రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు