కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ కుటుంబాన్ని మాజీమంత్రి దేవినేని ఉమా, మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. ఓ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న నవీన్‌ను కొందరు హత్య చేశారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా తెదేపా తరఫున లక్ష రూపాయలను కుటుంబసభ్యులకు అందజేశారు. ప్రశ్నించే వ్యక్తిని హత్య చేయటం దారణమని దేవినేని ఉమా పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తి చేసినది కాదనీ... దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నవీన్ హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: తెదేపా సోషల్ మీడియా కార్యకర్త చిరుమామిళ్ళ కృష్ణారావు అరెస్ట్