రెడ్డిగూడెం మండలం పాతనాగులూరు గ్రామంలో సామాజిక భవనానికి ఎంపీ కేశినేని నాని 50 లక్షల రూపాయలు మంజూరు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. శిలాఫలకంపై బొమ్మలు వేసుకుని శంకుస్థాపన చేసిన వైకాపా శాసనసభ్యుడిపై.. అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను ప్రశ్నిస్తున్నారనే రాజకీయకక్షతోనే విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి నిర్మాణాలను కూల్చి వేశారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ వేధింపులకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ తరహా చర్యలకు తెదేపా నాయకులు, కార్యకర్తలు భయపడబోరని దేవినేని ఉమా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: