కృష్ణా జిల్లా నందిగామలో పులివెందుల తరహా పంచాయతీలు తీసుకొచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. వైకాపా నేతల ప్రోద్భలంతోనే మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటిపై దాడి జరిగిందన్నారు. దాడికి నిరసనగా సౌమ్య రిలే నిరాహార దీక్ష చేపట్టగా..నిమ్మరసమిచ్చి ఆయన దీక్ష విరమింపజేశారు. సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే కుట్రలు, దుర్మార్గాలకు తెదేపా నేతలు, కార్యకర్తలు భయపడరని ధైర్యంగా పోరాటం చేస్తారని తెలిపారు.
డబ్బు, అధికారం, దౌర్జన్యాలతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించటం కోసం వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. అందులో భాగంగానే తంగిరాల సౌమ్య ఇంటిపై దాడి జరిగిందన్నారు. సౌమ్యకు పోలీసు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచదవండి