ETV Bharat / state

కొవిడ్​ విధులకు నర్సింగ్​ విద్యార్థుల నిరాకరణ

కరోనా... ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యేలా చేస్తోంది. బాధితులకు చికిత్స అందించేందుకు వైద్య విద్యార్థులే వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి డాక్టర్‌ శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు.. కొవిడ్​ విధులకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో కళాశాల వద్ద కొంత ఆందోళన వాతావరణం నెలకొంది.

Denial of covid duties by nursing students
కొవిడ్​ విధులకు నర్సింగ్​ విద్యార్థుల నిరాకరణ
author img

By

Published : May 2, 2021, 11:59 AM IST

కొవిడ్‌ విధులకు వెళ్లం మేడం అంటూ నర్సింగ్‌ విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని కోరిన సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి డాక్టర్‌ శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్‌ కళాశాలలో చోటుచేసుకుంది. కళాశాల 4వ ఏడాది నర్సింగ్‌ విద్యార్థుల్లో ఇతర రాష్ట్రాల వారిని తల్లిదండ్రుల కోరిక మేరకు ఇళ్లకు పంపిన యాజమాన్యం, స్థానిక విద్యార్థులను ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు తరగతులు, క్లినిక్‌ కింద కొవిడ్‌ ఆసుపత్రి విధులకు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత అంగీకరించిన విద్యార్థినుల్లో కొందరు.. నిన్న ససేమిరా అనడంతో ఒకింత ఆందోళన వాతావరణం నెలకొంది. సదరు విద్యార్థినులకు కరోనా విపత్కర పరిస్థితులో నర్సింగ్‌ విద్యార్థులుగా మనం తప్ఫ. ఎవరూ ముందుకొస్తారంటూ కళాశాల ప్రిన్సిపల్‌ వందన అవగాహన కల్పించడంతో తిరిగి విధులకు వెళ్లేందుకు విద్యార్థినులు ఒప్పుకున్నారు. నర్సింగ్‌ కళాశాల విద్యార్థులను యాజమాన్యం కొవిడ్‌ విధులకు బలవంతం పెట్టినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని వందన పేర్కొన్నారు. 34 మంది కళాశాల విద్యార్థినులు కరోనా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ సేవలందిస్తున్న సిద్ధార్థ నర్సింగ్‌ విద్యార్థినులను పిన్నమనేని వైద్య కళాశాల యాజమాన్యం, రాష్ట్ర కొవిడ్‌ నియంత్రణ వైద్య బృందం ప్రత్యేకంగా అభినందించింది.

పిన్నమనేనిలో నర్సుల కొరత

గన్నవరం మండలం పిన్నమనేని కొవిడ్‌ ఆసుపత్రిలో నర్సుల కొరత విధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు పాతిక మందికి ఒక నర్సు చొప్పున విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది. మరో వైపు రోగులకు చికిత్సను అందించే వైద్య బృందం కూడా పెరుగుతున్న కేసులను చూసి విసిగిపోతున్నారని తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ పడకలన్నీ పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఒక ఆక్సిజన్‌ పడక ఖాళీ అయితే క్యూలో పదిమంది ఉంటున్నారని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలోని 400 పడకలకు.. నిన్న 390 మంది బాధితులు చికిత్స పొందుతుండగా.. అందులో 210 మందికి అత్యవసర ఆక్సిజన్‌ చికిత్స, 20 మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు కొత్తగా మరో 26 మంది చేరగా.. నలుగురు బదిలీ కావడంతో పాటు ఆరు మరణాలు నమోదైనట్లు నోడల్‌ అధికారి లాల్‌మహ్మద్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం దురదృష్టకరం: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.