ఉండవల్లి కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను సీఆర్డీఏ అధికారులు తొలగిస్తున్నారు. మూడు రోజుల క్రితం కరకట్ట కింద ఉన్న నిర్మాణాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కరకట్ట ప్రాంతంలో పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని కూలగోడుతున్నారు. నదీ ప్రవాహ మార్గంలో రివర్ బెడ్‌ను ఆనుకుని ఉన్న కాంక్రీట్ నిర్మాణం కూల్చేశారు. తాము నోటీసులు ఇచ్చిన ప్రకారం కరకట్ట పై ఉన్న అక్రమ నిర్మాణాలను క్రమపద్ధతిలో తొలగిస్తామని సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. నోటీసులు ఇచ్చినా స్పందించనందున నిర్మాణం కూలుస్తున్నట్లు తెలిపారు.
సీఆర్డీఏ అధికారులు మాత్రం తమకు ఇచ్చిన నోటీసులో తేదిని వెల్లడించలేదని పాతూరి కోటేశ్వరరావు తెలిపారు. నోటీసుల్లో సమగ్ర వివరాలు వెల్లడించలేదని న్యాయస్థానాన్ని సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
కృష్ణా కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 31 కట్టడాలకు సీఆర్డీఏ అధికారులు గతంలో ప్రాథమిక నోటీసులిచ్చారు. తర్వాత వారిని పిలిచి... వారి వాదనలు విని, 5 కట్టడాలు కూల్చి వేయాలని నిర్ణయించి.. తుది నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో ఆ కట్టడాలను వారే కూల్చివేయాలని, లేకపోతే సీఆర్డీఏ చర్యలు తీసుకుంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు .
ఇదీ చదవండి