కృష్ణా జిల్లా దివిసీమ వద్ద 216 జాతీయ రహదారిపై వాహనాల్లో వెళ్తున్నవారు ఒక్కసారిగా ఆగి మరీ పుట్టగొడుగులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పుట్టగొడుగులకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. వీటిని తినడం వలన శరీరంలో చెడు కొవ్వు కరుగుతుందని, మెదడు చురుకుగా ఆరోగ్యకరంగా పనిచేస్తుందని అల్జీమర్స్ సమస్యలు నివారిస్తుందని.. అలాగే విటమిన్ బి, సి తో పాటు కాల్షియం ఉంటాయని ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయని పల్లె ప్రజల నమ్మకం.
ప్రస్తుత కొవిడ్ 19 వైరస్ తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోటానికి ఇవి బాగా పనిచేస్తాయని కొనుగోలు చేసేవారు చెబుతున్నారు. కోసురువారిపాలెం లాంటి కొన్ని గ్రామాల్లో వీటి కోసం రాత్రి సమయాల్లో సైతం యువత పుట్టల వద్దకు తిరుగుతున్నారంటే.. పుట్టగొడుగులకు ఎంత డిమాండ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: