ETV Bharat / state

108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం - కృష్ణా జిల్లాలో 108 వాహనంలో ప్రసవం

108 వాహనంలో గర్భవతికి ప్రసవం జరిగిన ఘటన కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో జరిగింది. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో నొప్పులు ఎక్కువ కావటంతో వాహనంలోనే ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

delivery in 108 vehicle in krishna district
108 వాహనంలో ప్రసవం
author img

By

Published : Aug 16, 2020, 6:19 PM IST

కృష్ణా జిల్లా పెద్దగుడుమోటుకు చెందిన నవ్య గర్భిణీ. ఆమెకు నొప్పులు రావటంతో అవనిగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కోడూరుకు చెందిన 108 వాహనానికి కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. వెంటనే వచ్చిన వాహనం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో నొప్పులు ఎక్కువయ్యాయి. 108 వాహనంలో ఉన్న మెడికల్ సిబ్బంది రవికిరణ్ గర్భిణీ తల్లి సాయంతో ఆమెకు ప్రసవం చేశారు. నవ్యకు బాబు పుట్టాడు.

108 ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్​ అస్మతుల్లాకు సమాచారం అందించగా.. ఆయన సలహా మేరకు నాగాయలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నర్సు తల్లీబిడ్డను పరిశీలించి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. సకాలంలో స్పందించి గర్భిణీకి ప్రసవం చేసిన 108 సిబ్బందికి ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి...

'మాన్సాస్​ను అడ్డుపెట్టుకుని వైకాపా క్షుద్ర రాజ‌కీయాలు చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.